విశాఖపట్నంలో వైఎస్ జగన్ పై కత్తితో దాడి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

విశాఖపట్నంలో వైఎస్ జగన్ పై కత్తితో దాడి


విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌ దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడి పందేలకు ఉపయోగించే కత్తితో ఈ దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమై రక్తం కారింది. శ్రీనివాస్ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స తర్వాత జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad