గ్రేజియా కవర్ పేజ్ పై దుమ్మురేపిన అనుష్క - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

గ్రేజియా కవర్ పేజ్ పై దుమ్మురేపిన అనుష్క

బాలీవుడ్ లేలేత నడుమందాల భామ.. అనుష్క శర్మ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్, భారత పరుగుల యంత్రం.. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని మస్తుగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు సొంతంగా 'నుష్' అనే వస్త్రాల బ్రాండ్ ను, మరోవైపు సినిమాలు నిర్మిస్తూ, నటిస్తూ ఇలా రెండు పడవలపైన విజయవంతంగా ప్రయాణిస్తోంది.. ఈ ముద్దుగుమ్మ. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలసి అనుష్క శర్మ నటించిన 'సూయిధాగా' చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి బాలీవుడ్ ఆశ్చర్యానికి గురవుతోంది. కాగా ఈ చిత్రంలో అనుష్క నటనకు ఫిదా అయిపోయిన బాలీవుడ్ ప్రముఖులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ భామ గ్రేజియా ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఇచ్చిన హాట్ లుక్స్ చూస్తే దిమ్మతిరగడం ఖాయం. ఆ రేంజులో ఈ సుందరి తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad