Video Of Day

Breaking News

సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమృత


మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత గురువారం మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తమపై అసభ్య పదజాలంతో కామెంట్లు పెడుతున్నారని, తిడుతున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. తమను కించపరచొద్దని కోరినా వినకుండా కామెంట్లు పెడుతూనే ఉన్నారని, వారిపైన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ సీఐకి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన మిర్యాలగూడ సీఐ ఆ వ్యక్తుల పేర్లు, ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని అమృతకు భరోసానిచ్చారు. కాగా, సోషల్ మీడియాలో ప్రణయ్-అమృతలకు ఎంతమంది పలుకుతున్నారో, అంతేస్థాయిలో అమృత తండ్రి మారుతీరావుకు మద్దతు పలుకుతున్నారు. 

No comments