తండ్రి ప్రకటనను ఖండించిన ఇవాంకా ట్రంప్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

తండ్రి ప్రకటనను ఖండించిన ఇవాంకా ట్రంప్


ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా తన కూతురు ఇవాంకా ట్రంప్ ను నియమిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇవాంకా ఖండించింది. తన తండ్రి ట్రంప్ ప్రకటించిన వెంటనే ట్విట్టర్ లో తనకు అలాంటి ఆసక్తి ఏమీ లేదని ప్రకటించింది. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేయడంతో ఇవాంకా ట్రంప్ అయితే మంచి పనితీరు కనబరుస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె తన తెలివితేటలతో ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రయోజనాలను కాపాడుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఇవాంకా తనకు ఆసక్తి లేదని ప్రకటించడంతో ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కాగా, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంలో ఇవాంక కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad