ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ముగ్గురు భామలు.. ఎవరు వారు..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ముగ్గురు భామలు.. ఎవరు వారు..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌ గురించి ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల కోసం ఓ మల్టీ స్టారర్‌ కథ సిద్ధం చేసిన రాజమౌళి మరో ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ను తెరమీదకు తీసుకువచ్చారంట. ఇద్దరు కథానాయకుల పక్కన ముగ్గురు కథానాయికలను ఎంచుకున్నారట. అందులో ఓ కథానాయికగా విదేశీ భామ కూడా ఉందట. ఆముగ్గరు ఎవరో త్వరలోనే ప్రకటిస్తారని చిత్రవర్గాలు తెలిపాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌ 5న లాంఛనంగా మొదలవుతుంది.  సరికొత్తగా కనిపించేందుకు నిపుణుడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌  ప్రత్యేక కసరత్తులు మొదలెట్టేశారు. చరణ్‌ పాత్ర, ఆయన గెటప్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad