ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్ షోయెబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అంటూ ‘బేబీ మీర్జా మాలిక్’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో వారికి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్ సానియా, షోయెబ్.’ అని ట్వీట్ చేశారు. గత కొద్ది కాలంగా బిడ్డ కోసం టెన్నిస్కు దూరంగా ఉన్న సానియా, 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నట్లు గతంలోనే వెల్లడించారు.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment