అవును.. సర్కార్‌ స్టోరి కాపీనే..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

అవును.. సర్కార్‌ స్టోరి కాపీనే..!

సౌత్ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ సర్కార్‌ కథ విషయంలో ఎట్టకేలకు కాం‍ప్రమైజ్‌ అయ్యాడు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన సర్కార్‌ చిత్ర కథ తనదేనంటూ ఆరోపిస్తూ వరుణ్ రాజేంద్రన్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్‌ కథ వరుణ్‌ రాజేంద్రన్‌దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సినిమా టైటిల్స్‌లో వరుణ్‌కు క్రెడిట్‌ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. దీపావళి కానుకగా నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad