కన్నడ వివాదస్పద హీరో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు శాండల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడట. మొదటి భార్య నాగరత్న, రెండవ భార్య కీర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించిన దునియా విజయ్ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. నెల రోజుల నుండి నాగరత్న, పిల్లలతో తీవ్ర వివాదాలు జరుగుతుండడంతో ఇదే అదనుగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని వార్తలు వినిస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించి విడాకులకు కోర్టుకెళ్లినా, మళ్లీ రాజీకి వచ్చారు. కానీ తాజా గొడవలతో విజయ్ మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment