రజనీని తోలుబొమ్మ అన్నందుకు సారీ చెప్పిన డీఎంకే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

రజనీని తోలుబొమ్మ అన్నందుకు సారీ చెప్పిన డీఎంకే!


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారి.. వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారని తన పార్టీ అధికార పత్రిక మురసోలిలో తీవ్రంగా విమర్శించిన డీఎంఏ ఆదివారం క్షమాపణలు కోరింది. రజనీకాంత్ అభిమానుల హృదయాలను గాయపరచినందుకు క్షమించాలని కోరింది. 1942లో కరుణానిధి చేతిరాతతో కరపత్రంగా మొదలైన మురసోలీ పత్రికలో ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారి. కరుణ జీవించినంతకాలం ప్రతిపేజీని చదివిన తర్వాతే ప్రచురణకు పంపుతారని సమాచారం. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రాసినప్పుడు కూడా వెనక్కుతగ్గకపోవడం గమనార్హం. 

No comments:

Post a Comment

Post Bottom Ad