స్మిత్‌, వార్నర్‌కు షాక్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

స్మిత్‌, వార్నర్‌కు షాక్‌

స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లకు ఆదేశ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది. వారిపై విధించిన నిషేధాన్ని సడలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడడంతో దీంతో స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అయితే టీమిండియాతో వచ్చేనెలలో సిరీస్‌ ఆరంభంకానున్న తరుణంలో వీరిపై నిషేధాన్ని సమీక్షించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నుంచి విన్నపాలు వచ్చిన నేపథ్యంలో సీఏ స్పందించింది. వారిపై నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని సీఏ స్పష్టం చేసింది. దీంతో స్మిత్‌, వార్నర్‌లు 2019 ఏప్రిల్‌ వరకూ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad