జేడీయూ వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ కిశోర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 16, 2018

జేడీయూ వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ కిశోర్!

Bihar  chief minister Nitish kumar appointed Prashant Kishore as the vice president of the JDU

ప్రశాంత్ కిశోర్.. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా వచ్చి వార్తల్లో ఎక్కువగా వినిపించిన పేరు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఆయన సేవలు అందించిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మొత్తంలో ప్యాకేజీతో ఏపీలో తన పార్టీ వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఇటీవల ప్రశాంత్ కిశోర్ బిహార్లోని జేడీయూ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయనున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా జేడీయూ వైస్ ప్రెసిడెంగ్గా ప్రశాంత్ను నియమిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రశాంత్ ఇప్పుడు పార్టీకి రెండో పెద్ద దిక్కన్నమాట.

No comments:

Post a Comment

Post Bottom Ad