లైవ్ ప్రోగ్రామ్లో పవన్ కల్యాణ్ గురించి అడగొద్దన్న బండ్ల గణేష్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 07, 2018

లైవ్ ప్రోగ్రామ్లో పవన్ కల్యాణ్ గురించి అడగొద్దన్న బండ్ల గణేష్!


తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ చానెల్ వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్తో సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ను తన దేవుడిలా పేర్కొంటుంటారు. ఇదే విషయాన్ని సినీ వేదికలపై కూడా పలుమార్లు చెప్పారు. అయితే ఇంటర్వ్యూలో పవన్ పేరెత్తితేనే ప్రోగ్రాం నుంచి బయటకు వెళ్తానని బెదిరించడం గమనార్హం. పవన్ తనకు వ్యక్తిగతంగా దేవుడని చెబుతూనే ఆయన విమర్శిస్తున్న పార్టీలో ఎలా చేరతారన్న ప్రశ్నకు తెల్ల మొహం వేశాడు. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక కారణమేంటి అడిగిన ప్రశ్నకు.. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని చెప్పుకొచ్చారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad