సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.936.50 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.936.50


గత ఆర్నెల్ల నుంచి క్రమంగా పెరుగుతున్న సిలిండర్‌ ధర.. తాజాగా రూ.58.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సబ్సిడీ లేని వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.936.50కు చేరింది. తాజా పెంపుతో గత ఆర్నెల్లలోనే రూ.233.50 మేర గ్యాస్‌ ధర పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌ ధరలో మాత్రం హైదరాబాద్‌లో మార్పు లేదు. మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలోకి వస్తుండటం తెలిసిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad