వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 17, 2018

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి!


ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ పదవులకు రాజీనామా చేశారు.. వంగవీటి శ్రీనివాస ప్రసాద్. ఉయ్యూరు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత వంగవీటి రంగా సోదరుడు శోభనా చలపతిరావు కుమారుడైన శ్రీనివాస ప్రసాద్.. వంగవీటి కుటుంబం పట్ల వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిగా నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణకు కేటాయించకపోవడం తీవ్ర అసంతృప్తి చెందిన శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే పవన్ కల్యాణ్ ను కలసి జనసేన పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు రాధాకు సీటు కేటాయించకపోవడంతో బెజవాడ భగ్గుమంది. వంగవీటి రాధా అనుచరులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి రాధా ఇలాంటి పిచ్చిపనులు చేస్తే సహించనని కార్యకర్తలను హెచ్చరించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad