మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెలకు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట వెలువరించిన 22 మంది జాబితాలో ఉపాసన స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా శాఖలు కలిగిన అపోలో హాస్పిటల్స్ లో అపోలో లైఫ్ విభాగానికి ఆమె ఎండీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అపోలో సీఎస్ఆర్ విభాగానికి వైస్ చైర్మన్ గా ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, అధినేత ప్రతాప్.సి.రెడ్డి మనవరాలైన ఉపాసన ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. మూగజీవుల సంరక్షణ చర్యలతోపాటు అనాథలకు అండగా నిలుస్తూ ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఆరోగ్యం, వ్యాయామం, పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన పెంచడానికి వివిధ పోస్టులు పెడుతుంటారు. ఒకవైపు సామాజికసేవ, మరోవైపు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రెండు పడవలపైన విజయవంతంగా పయనిస్తున్నారు.. ఉపాసన. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టుమారో టైకూన్ గా నిలిచారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad