ఇండోనేషియాలో సునామీకి 384 మంది బలి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

ఇండోనేషియాలో సునామీకి 384 మంది బలి


ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సముదాయ దేశం ఇండోనేషియాలో సంభవించిన భూకంపానికి మొత్తం 384 మంది మరణించారు. శుక్రవారం ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలోని తీర ప్రాంత నగరం 'పాలు'లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. భూప్రకంపనాల ఫలితంగా ఒక్కసారిగా సునామీ విరుచుకుపడింది. పది అడుగుల ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. సమీపంలోని భవనాలను నీరు చుట్టిముట్టి నేలకూల్చింది. దీంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ నలువైపులా పరుగులు దీశారు. భూకంపం, సునామీ ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత నెలలోనూ వరుసగా సంభవించిన భూకంపాలు ఇండోనేషియాను తీవ్రంగా అతలాకుతలం చేశాయి.  కాగా, తాజా భూకంపం, మధ్య సులవేసిలో శుక్రవారం సాయంత్రం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. వివరాలు పూర్తిగా తెలిశాక మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. వందలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad