తమిళ ఆర్ఎక్స్ 100లో ఆ సన్నివేశాలకు ఓకే అంటున్న హీరోయిన్ తాప్సీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

తమిళ ఆర్ఎక్స్ 100లో ఆ సన్నివేశాలకు ఓకే అంటున్న హీరోయిన్ తాప్సీ!


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం.. ఆర్ఎక్స్ 100. అతి తక్కువ బడ్జెట్ తోనే రూపొందిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాన్ని ఆర్జించింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. ప్రముఖ నటుడు శింబు హీరోగా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించడానికి అంగీకరించిందని సమాచారం. ఆర్ఎక్స్ 100 ఘనవిజయం సాధించడానికి ఆ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాలే కారణం. ఈ సన్నివేశాల్లో నటించాల్సి  ఉంటుందని దర్శకుడు చెప్పగా తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగులో తాప్సీ తొలి చిత్రం 'ఝుమ్మంది నాదం'లోనే అమ్మడు ఓ రేంజులో అందాలు ఆరబోసింది. వాటినే రసిక ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100లో నటిస్తుండటంతో బోల్డ్ ఈ భామను ఆ సన్నివేశాల్లో చూడటానికి తమిళ తంబీలు సిద్ధమై పోతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad