వెర్వ్ మ్యాగజైన్ కవర్ పై అదరగొట్టిన టబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

వెర్వ్ మ్యాగజైన్ కవర్ పై అదరగొట్టిన టబు


తెలుగులో అగ్రహీరోలందరితో నటించింది.. అందాల భామ టబు. విక్టరీ వెంకటేశ్ తో కూలీ నెంబర్ 1, అక్కినేని నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ, బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, పాండురంగడు, మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు చిత్రాల్లో నటించి తన అందాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. వాస్తవానికి, టటు హైదరాబాద్ లోనే జన్మించినా తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ చేసింది. 46 ఏళ్ల వయసు ఉన్న ఈ భామ బ్యాచిలర్ గానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇంత వయసున్నప్పటికీ ఆమెను చూస్తే అంత వయసు ఉందంటే నమ్మడం చాలా చాలా కష్టం. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వు, ఆరు అడుగుల పొడవు ఉన్న ఈ ముద్దుగుమ్మను ఒక్కసారి చూస్తేనే హృదయం పులకరిస్తుంది. తాజాగా వెర్వ్ మ్యాగజైన్ కోసం ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన పోజు కుర్రకారు గుండెలను గిలిగింతలు పెడుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad