శ్రుతి హాసన్ అందాలకు అభిమానులు ఫిదా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

శ్రుతి హాసన్ అందాలకు అభిమానులు ఫిదా


సంప్రదాయ కుటుంబంలో జన్మించినా అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పని భామామణి.. శ్రుతిహాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఒకప్పటి నటి సారికల కుమార్తె అయిన శ్రుతి ఎక్స్ పోజింగ్ పెట్టింది పేరు. తొలి చిత్రం 'లక్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం లక్ తెచ్చిపెట్టలేకపోయింది. తెలుగులో చేసిన 'అనగనగా ఓ ధీరుడు', 'ఓ మై ఫ్రెండ్' కూడా నిరాశపరిచాయి. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన 'గబ్బర్ సింగ్' శ్రుతిని ఓ రేంజులో నిలబెట్టింది. ఆ తర్వాత బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అగ్ర నాయికగా మారిపోయింది. కాగా, శ్రుతి తెలుగులో చివరిసారిగా నటించిన చిత్రం.. కాటమరాయుడు. ప్రస్తుతం తన తండ్రితో కలసి శభాష్ నాయుడు చిత్రంలో శ్రుతి నటిస్తోంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తన లండన్ ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఎప్పటికప్పుడు వివిధ మ్యాగజైన్లకు హాట్ హాట్ పోజులిస్తోంది. ఏ మాత్రం మొహమాటకుండా ఫొటో షూట్లు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రుతి ఫొటోలు అభిమానులను ఓ రేంజులో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలపై మీరు కూడా ఒక లుక్కేయండి. 

No comments:

Post a Comment

Post Bottom Ad