టాలీవుడ్ కు కలిసి వస్తున్న సెప్టెంబర్ 27 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

టాలీవుడ్ కు కలిసి వస్తున్న సెప్టెంబర్ 27


టాలీవుడ్ కు సెప్టెంబర్ 27 కలిసి వస్తుందా అంటే ట్రేడ్ పండితుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఇదే రోజున విడుదలైన 'స్టూడెంట్ నెంబర్ వన్', 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్.. జూనియర్ ఎన్టీఆర్ కు మొదటి హిట్ చిత్రంకాగా, అత్తారింటికి దారేది తో పవర్ స్టార్ టాలీవుడ్ రికార్డులను తిరగరాశారు. పైరసీబారిన పడినప్పటికీ, సగం సినిమా హెచ్డీ క్వాలిటీతో బయటకు వచ్చినప్పటికీ అత్తారింటికి దారేది ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలవుతున్న నాని, నాగార్జునల మల్టీస్టారర్ మూవీ దేవదాస్ కూడా పెద్ద హిట్ అవుతుందని టాలీవుడ్ ఆశాభావంతో ఉంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఫలితం మరికొద్ది సేపట్లోనే తేలిపోతుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad