రేవంత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

రేవంత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

revanth reddy cash for vote scam income tax raids
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ఇంటిపై ఈ రోజు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ సంపద బయటపడింది వార్తలు వస్తున్నాయి. రేవంత్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కనీసం వెయ్యి కోట్ల రూపాయలుగా ఈడీ అధికారులు తేల్చారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులున్నాయని కూడా కథనాలు వస్తుండటం విశేషం.

దుబాయ్, అమెరికా, మలేసియా వంటి చోట్ల రేవంత్ రెడ్డికి ఆస్తులున్నాయని ఈ మేరకు ఈడీ నిర్దారణ చేసిందని టీవీ చానళ్లు వార్తా కథనాలను ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి వియ్యంకుడికి చెందిన కంపెనీలో భారీ అక్రమాలు జరిగాయని మీడియా అంటోంది. అయితే రేవంత్ ఇంటిపై సోదాల విషయంలో ఈడీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మరోవైపు ఈ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందు వల్లనే అణిచి వేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ దాడులతో రేవంత్ రెడ్డి అరెస్టు కూడా జరుగుతుందా? అనేది చర్చనీయాంశంగా నిలుస్తోంది. ఈ వ్యవహారంలో తనను అరెస్టు చేయవచ్చని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad