అత్తాపూర్ హత్యకు కారణాలివే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

అత్తాపూర్ హత్యకు కారణాలివే!

reasons-behind-attapur-murder

హైదరాబాద్లో పట్టపగలు నలుగురు కలిసి బుధవారం అత్తాపూర్ వద్ద  సిద్ధి అంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్ (35) దారుణంగా నరికి చంపిన ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. గతంలో ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం విషయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా రమేశ్ తన ప్రాణ స్నేహితుడు మహేశ్ గౌడ్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేశ్ను నేడు మహేశ్ బంధువులు హత్య చేసినట్లు తెలుస్తుంది. పట్టపగలు, రద్దీగా ఉన్న ప్రాంతంలో రమేశ్ను ఇద్దరు వెంటాడారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ లోగా మరో వ్యక్తి రమేశ్ను గొడ్డలితో నరికాడు. కానిస్టేబుల్‌ను విదిలించుకుని వచ్చిన వ్యక్తి ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad