యంగ్ టైగర్ హీరోగా మెగా పవర్ స్టార్ నిర్మాతగా సినిమా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

యంగ్ టైగర్ హీరోగా మెగా పవర్ స్టార్ నిర్మాతగా సినిమా!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం తన కొణిదెల ప్రో కంపెనీ బ్యానర్ లో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథను తెరకెక్కిస్తున్నారు. సైరా పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. కొణిదెల ప్రో కంపెనీలో మొదటి చిత్రం కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన విషయం తెలిసిందే. ఖైదీనెంబర్ 150, సైరా తర్వాత మూడో చిత్రంగా తన బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చరణ్ సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా అంగీకరించినట్టు సమాచారం. అయితే కొంతమంది మాత్రమే ఇది గాసిప్పేనని కొణిదెల ప్రో కంపెనీలో మూడో సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మొదలవబోతోందని అంటున్నారు. మరికొద్ది రోజులు ఆగితే కానీ వాస్తవం ఏమిటో వెల్లడి కాదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad