11 ఏళ్లు పూర్తిచేసుకున్న మెగాపవర్ స్టార్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

11 ఏళ్లు పూర్తిచేసుకున్న మెగాపవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తెలుగు సినిమాల్లో ప్రవేశించి నేటితో 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చెర్రీ తన ఫేస్ బుక్ లో ఆనందం వ్యక్తం చేశాడు. సినిమాల్లోకి ప్రవేశించి అప్పుడే 11 ఏళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని, నిన్నే సినిమాల్లోకి ప్రవేశించినట్టు ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనతో సినిమాలు రూపొందించిన దర్శకులు, నిర్మాతలకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తన నట ప్రయాణంలో తనతో ఉన్నవారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. మీరు ఇచ్చిన దీవెనలకు, గౌరవానికి, మంచితనానికి, మీ ప్రేమకు లొంగిపోయానంటూ పేర్కొన్నాడు. చరణ్ సతీమణి ఉపాసన దీన్ని స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసింది. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమా మగధీరతో అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాశాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన రంగస్థలం సౌతిండియాలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad