పరువు కోసం ప్రణయ్ హత్య! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

పరువు కోసం ప్రణయ్ హత్య!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలే వినోభానగర్కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు బలయ్యాడు. దళిత కుటుంబంలో పుట్టి ఆర్నెల్ల క్రితం మిర్యాలగూడలో ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, అగ్ర వర్ణానికి చెందిన మారుతీరావు కూతురు అమృతను ప్రేమవివాహం చేసుకోవడమే అతని పాలిట శాపమైంది. కూతురును ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ను పరువు కోసం పగబట్టిన మారుతీరావు అనుక్షణం నిఘాపెట్టి, చివరికి పట్టపగలే కిరాయి హంతకుల సాయంతో కడతేర్చాడు.
ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితులు అమ్మాయి తండ్రి మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌లతోపాటు ఇద్దరు సుఫారీ కిల్లర్‌లను శనివారం హైదరాబాద్ లోని కొత్తపేటలో అరెస్టు చేశారు. ప్రణయ్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుఫారీ ఇచ్చానని తొలుత రూ. 5 లక్షల అడ్వాన్స్‌ ఇచ్చినట్లు మారుతీరావు పోలీసు విచారణలో తెలిపాడు. తన కూతురుకి మాత్రం హానీ తలపెట్టొద్దని వారికి సూచించినట్లు చెప్పాడు. ప్రణయ్‌ కోసం సుఫారీ గ్యాంగ్‌ రెండు నెలలుగా రెక్కీ నిర్వహించిందని, జైలుకు వెళ్లడానికి సిద్దపడే ఈ ప్లాన్‌ వేశానని మారుతీరావు చెప్పాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad