ఆర్ఎక్స్ 100 భామకు భారీ ఆఫర్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

ఆర్ఎక్స్ 100 భామకు భారీ ఆఫర్లు


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో పెద్ద విషయం లేకున్నా కుర్రకారుకు నచ్చే మంచి మసాలా సన్నివేశాలు, లిప్ లాక్ లు ఉండటంతో మంచి కలెక్షన్లు సాధించింది. ఇందులో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఇప్పుడు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఆ చిత్రంలో కోరికతో రగిలిపోయే యువతిగా, మరోవైపు తన కోరిక తీర్చుకోగానే అత్యంత కిరాతకంగా హీరోని చంపించే పాత్రలోనూ పాయల్ జీవించేసింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మించనున్న ఓ సినిమాలో పాయల్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ద‌ర్శ‌కుడు భాను శంక‌ర్ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad