16 ఏళ్ల వయసులోనే రేప్ కి గురయ్యానని బాంబుపేల్చిన నటి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

16 ఏళ్ల వయసులోనే రేప్ కి గురయ్యానని బాంబుపేల్చిన నటి


ప్రముఖ రచయిత్రి, టీవీ ప్రయోక్త, నటి, మోడల్ అయిన ఇండో అమెరికన్ పద్మాలక్ష్మి (48).. తాను 16 ఏళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని బాంబుపేల్చింది. తాజాగా న్యూయార్స్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించింది. 32 ఏళ్ల కిందట తాను అమెరికాలో హైస్కూల్ లో చదువుతూ స్కూల్ ముగిశాక.. దగ్గరలోని స్టోర్ లో పనిచేసేదాన్నని, తన బాయ్ ఫ్రెండ్ (23) కళాశాలలో చదివేవాడని తెలిపింది. కాలేజీ ముగిశాక అతడు కూడా దగ్గరల్లోని ఒక మాల్ లో పనిచేసేవాడని పేర్కొంది. ఒకరోజు ఇద్దరం కలసి ఒక పార్టీకి హాజరయ్యామని, అప్పుడు తాను స్లీవ్ లెస్ గౌను తొడుక్కున్నానని, పార్టీ ముగిశాక అతడు తనను అతడి అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లాడని వివరించింది. పార్టీలో బాగా డ్యాన్సు చేసి అలసిపోయిన తాను నిద్రపోయానని, అర్ధరాత్రి వేళ రెండు కాళ్ల మధ్య కత్తితో కోసినట్టు అనిపించడంతో లేచిచూడగా తన బాయ్ ఫ్రెండ్ తనను అత్యాచారం చేస్తున్నాడని నాటి సంఘటనను వెల్లడించింది. తాను వద్దని మొరాయించినా అతడు వినలేదని కొద్దిసేపేనంటూ తనను అనుభవించాడంటూ కన్నీళ్లపర్యంతం అయ్యింది. కాగా, 48 ఏళ్ల పద్మాలక్ష్మి ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీతో చాలాకాలం డేటింగ్ చేసి అతడిని పెళ్లాడి విడాకులిచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad