తన ప్రియుడి ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్న నటి నీలాణి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 19, 2018

తన ప్రియుడి ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్న నటి నీలాణి


టీవీ సీరియల్ నటి నీలాణి తన ప్రియుడి ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అసిస్టెంట్ డైరెక్టర్ గాంధీలలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని ఒప్పుకుంది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు వెల్లడించింది. లలిత్‌కుమార్‌ తన గురించి అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పెట్టడం, వేధించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని విలపించింది. అంతేగాకుండా తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. ఇదిలా ఉంటే లలిత్‌కుమార్‌తో పరిచయానికి ముందే నీలాణికి పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తను వదిలి పిల్లలతో నివసిస్తున్న నీలాణికి గాంధీలలిత్‌కుమార్‌ పరిచయం కావడం, అతనితో ప్రేమ, సహజీవనం చేసినట్లు సమాచారం. ఇటీవల టీవీ సీరియల్‌ షూటింగ్‌లో ఉన్న నీలాణి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని లలిత్‌కుమార్‌ ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది లలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad