బిగ్ బాస్ లో పవన్ హీరోయిన్ కు షాక్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 17, 2018

బిగ్ బాస్ లో పవన్ హీరోయిన్ కు షాక్!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఖుషీ సినిమాలో ఆడిపాడిన ముంతాజ్ గుర్తుందిగా. ఆ సినిమాలో అమ్మడి మత్తైన మాటలకు, హోయలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ముంతాజ్ పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఎందుకోగానీ ఆమె తమిళ సినిమాలకే పరిమితమై పోయారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళంలో బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నది. అయితే ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో ముంతాజ్ ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు నివ్వెరపోయారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని ముంతాజ్ అభిమానులు ఆశలు పెట్టుకోగా ఎలిమినేట్ అయ్యి ఆమె అభిమానులను నిరాశపరిచింది. అయితే బిగ్ బాస్ షోలో ఆమె ప్రవర్తనకు ముంతాజ్ అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో రుత్విక అనే కంటెస్టెంట్‌కు ముంతాజ్‌కు చిన్న గొడవ జరిగడంతో ఆమె ఎలిమినేట్ కు నామినేట్ అయింది.

No comments:

Post a Comment

Post Bottom Ad