రేవంత్ రెడ్డి ఇంట్లో కోటి రూపాయల నగదు స్వాధీనం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

రేవంత్ రెడ్డి ఇంట్లో కోటి రూపాయల నగదు స్వాధీనం!

money-seized-at-revanth-house

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో రెండోరోజూ ఇన్కమ్ టాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నిన్న(గురువారం) ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగియగా... అధికారులు ఆయనను కూడా విచారించారు. రేవంత్‌రెడ్డిని 10 గంటల పాటు ఐటీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో సంబంధమున్న సెబాస్టియన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు, సోమవారం (అక్టోబరు 1)లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంట్లో కోటి రూపాయల నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad