ప్రేమ వివాహం చేసుకున్నందుకు కడతేర్చిన కన్నతండ్రి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 19, 2018

ప్రేమ వివాహం చేసుకున్నందుకు కడతేర్చిన కన్నతండ్రి!

manohara-chary-killed-his-daughter-for-love-marriage

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అమృతను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ పరువు హత్య ఉదంతం మరవకముందే హైదరాబాద్ లోనూ అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని బోరబండకు మనోహరాచారి కూతురు మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, బుధవారం మధ్యాహ్నం సెటిల్‌మెంట్‌ కోసమని వారిని పిలిచి మాధవితో పాటు సందీప్‌పై చారి కత్తితో దాడి చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన  కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేపోయిన మనోహరాచారి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మాధవి పరిస్థితి సీరియస్‌గా ఉండగా, సందీప్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad