ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో గోవా సీఎం పారికర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో గోవా సీఎం పారికర్!


manohar parikar-resign-cm

గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పాలనా వ్యవస్థ గాడితప్పకుండా ఉండటానికి తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గోవాలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. దేశ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఆ పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad