తండ్రి కాబోతున్న వివాదాస్పద హీరో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

తండ్రి కాబోతున్న వివాదాస్పద హీరో

మళయాలం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి భావన కేసులో నిందితుడు, ప్రముఖ నటుడు దిలీప్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, ప్రముఖ నటి కావ్యా మాధవన్ అతి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రముఖ సినీ నటి భావనపై లైంగిక వేధింపులు, అత్యాచారం యత్నం కేసులో దిలీప్ జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ లభించడంతో బయట ఉన్న దిలీప్ ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ఒక చిత్రం షూటింగ్ ముగించుకుని వస్తున్న భావనను కారు డ్రైవర్ సహాయంతో కిడ్నాప్ చేయించి, లైంగిక దాడికి యత్నించి, ఆమెను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయించారని దిలీప్ పై కేసు నమోదైంది. ఈ సంఘటన మల్లువుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) నుంచి దిలీప్ ను తొలగించి మళ్లీ సభ్యత్వం ఇవ్వడంతో పలువురు నటీమణులు భావనకు మద్దతుగా అమ్మ నుంచి వైదొలిగిన సంగతి విదితమే. 

No comments:

Post a Comment

Post Bottom Ad