కత్రినా కైఫ్ తో నటించలేనంటున్న సల్మాన్ బావమరిది. కారణం అదేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

కత్రినా కైఫ్ తో నటించలేనంటున్న సల్మాన్ బావమరిది. కారణం అదేనా?


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ భర్త ఆయుష్ శర్మ.. అందాల భామ కత్రినా కైఫ్ తో కలసి నటించనని మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నిర్మాతగా తెరకెక్కుతున్న 'లవ్ రాత్రి'తో బాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.. ఆయుష్ శర్మ. ఇందులో వహైరా హుస్సేన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకుముందు ఆయుష్ శర్మతో కలసి నటించలేనని కత్రినా కైఫ్ వెల్లడించగా.. తాజాగా ఆయుష్ శర్మ కూడా కత్రినాతో నటించడానికి ఇష్టపడనంటూ తేల్చేశాడు. అలా అని ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని అనుకునేరు. అదేమీ కాదండి.. సల్మాన్ ఖాన్ ఘాటు ప్రేమాయణం నడిపిన కత్రినా.. సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మకు వరుసకు సోదరి అవుతారు. అదేవిధంగా కత్రినా కైఫ్ కు ఆయుష్ శర్మ సోదరుడు వరుస అవుతారు. కత్రినా.. ఆయుష్ సినిమాలో నటిస్తే సల్మాన్ కు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇద్దరూ ఒకరితో ఒకరు నటించబోమని తేల్చిచెప్పేస్తున్నారు. బాగుంది కదూ.. వీళ్లిద్దరి వరుస..!

No comments:

Post a Comment

Post Bottom Ad