ఆ హీరోతో నటించడానికి సదా సిద్ధమంటున్న స్టార్ హీరోయిన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

ఆ హీరోతో నటించడానికి సదా సిద్ధమంటున్న స్టార్ హీరోయిన్


కరీనా కపూర్ బాలీవుడ్ లో చాలాకాలంపాటు అగ్ర నటిగా రాణించిన నటి. షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్ వంటి హీరోలతో డేటింగ్ చేసిన ఈ అందాల భామ చివరకు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చింది. అయినా తన అందాలు ఏ మాత్రం బిగిసడలకుండా నిత్యం వర్కవుట్లు చేస్తోంది. కొద్దిరోజుల కిందట తన 38వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకున్న కరీనా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించింది. తన బాబాయ్ కుమారుడు, ప్రముఖ హీరో రణ్ బీర్ కపూర్ దేశంలోనే గొప్ప నటుల్లో ఒకడని కితాబులిచ్చింది. భవిష్యత్ లో బాలీవుడ్ ను ఒక స్థాయికి తీసుకెళ్లగల నటులు రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ లేనని వెల్లడించింది. తన తమ్ముడు రణ్ బీర్ తో కలిసి నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దయచేసి దర్శకులు మంచి స్క్రిప్ట్ తో తన వద్దకు రావాలని కోరింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad