జగ్గయ్యపేట నుంచి జనసేన నుంచి పోటీ చేసేది ఎవరంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

జగ్గయ్యపేట నుంచి జనసేన నుంచి పోటీ చేసేది ఎవరంటే..

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట ఒకటి. నల్గొండ జిల్లా బోర్డర్ లో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి  ప్రస్తుతం శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరుడిగా ఉన్న శ్రీరాం 2009 ఎన్నికల్లో ఆయనపైనే జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభానుపై పోటీ చేసి స్వల్ప తేడాతో రాజగోపాల్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి వీరిద్దరే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా పోటీలో ఉంటుంది. జనసేన పార్టీ నుంచి సామినేని ఉదయభాను మేనల్లుడు పోటీ చేస్తారనే వార్తలు నియోజకవర్గంలోనూ, జనసేన క్యాడర్ లోనూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న భాను మేనల్లుడు జగ్గయ్యపేట నుంచి పోటీ చేస్తే త్రిముఖ పోటీ ఖాయం. 

No comments:

Post a Comment

Post Bottom Ad