వరుసగా రెండోసారి ఆసియా కప్ మనదే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

వరుసగా రెండోసారి ఆసియా కప్ మనదే


ఉత్కంఠభరితంగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. చివరి బంతి వరకు ఆధిక్యం చేతులు మారిన వేళ.. మూడు వికెట్ల తేడాతో నెగ్గి ఊపిరిపీల్చుకుంది.  టాస్ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ చెలరేగి ఆడాడు. భారత బౌలర్లను ఊచకోత వేశాడు. కేవలం 117 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మెహదీ హసన్ కూడా బాగానే ఆడటంతో బంగ్లా ఒక్క వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇక అక్కడి నుంచి భారత బౌలర్లు పుంజుకున్నారు. బ్యాటింగ్ కు వచ్చినవారిని వచ్చినట్లు పెవిలియన్ కు పంపారు. దీంతో బంగ్లా బ్యాట్సమన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 50 ఓవర్లు కూడా ఆడకుండానే కేవలం 48.3 ఓవరల్లోనే 222 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడు వికెట్లు, కేదార్ జాదవ్ రెండు వికెట్లు తీసి బంగ్లా వెన్నువిరిచారు. కష్టసాధ్యం కాని లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను బంగ్లా బౌలర్లు వణికించారు. అద్భుత పామ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడటంతో భారత్ లక్ష్యంవైపు కదిలింది. అయితే 48 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, ధోని లక్ష్యంగా దిశగా తీసుకెళ్లారు. ధోని 36, దినేశ్ 37 పరుగులు చేశారు. అయితే భారీగా బంతులు తినేయడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ఓటమి తప్పదనుకుంటున్న దశలో కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, బౌలర్ భువనేశ్వర్ కుమార్ తలో చేయి వేయడంతో భారత్ మ్యాచ్ గెలిచి ఊపిరిపీల్చుకుంది. మొత్తం మీద ఏడోసారి, వరుసగా రెండో ఏడాది భారత్ ఈ టైటిల్ దక్కించుకుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad