వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని రమ్యకృష్ణ పుట్టిన రోజు నేడు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని రమ్యకృష్ణ పుట్టిన రోజు నేడు


90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా తెలుగు నాట ఒక ఊపు ఊపింది.. అందాల తార రమ్యకృష్ణ. ఈ తమిళ బ్యూటీ తెలుగు, తమిళంతోపాటు దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి సూపర్ హిట్లు కొట్టింది. బాలీవుడ్ మూవీస్ లోనూ సత్తా చాటింది. ఇచ్చిన పాత్ర ఏదైనా తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో సినిమాను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లగల అతి తక్కువ మంది నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. సౌందర్య హీరోయిన్ గా వచ్చిన 'అమ్మోరు', సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన 'నరసింహ', యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి-ద కన్ క్లూజన్' వంటి చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు గీటురాళ్లు. ఆయా చిత్రాల సూపర్ సక్సెస్ లో రమ్యకృష్ణ పాత్ర కీలకం. అటు గ్లామర్ డాల్ గా నటించాలన్నా, ఇటు అమ్మోరుగా నటించాలన్నా, విలన్ గా రాణించాలన్నా రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా. నేడు ఈ ముద్దుగుమ్మ జన్మదినం. సెప్టెంబర్ 15తో ఈ అందాల రాశి ఐదు పదుల వయసుకు చేరుకుంటోంది. అయితే వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందాలతో తన అభిమానులను కట్టిపడేస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad