మంచి మనసు చాటుకున్న విక్రమ్ తనయుడు ధ్రువ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

మంచి మనసు చాటుకున్న విక్రమ్ తనయుడు ధ్రువ్

భారీ వర్షాలు, వరదలతో 'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పేరుగాంచిన కేరళ అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. బాధితులను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ముందుకొచ్చి భారీ విరాళాలు ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు ఇదే కోవలో ముందుకొచ్చాడు.. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో తమిళంలో ఆరంగేట్రం చేస్తున్న ఈ హీరో ఈ సినిమాకు తీసుకున్న తన పారితోషికం మొత్తాన్ని కేరళ వరద బాధితులకు సహాయం అందజేశాడు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కలసి చెక్కు అందించాడు. ఈ సందర్భంగా కేరళ సీఎం ఈ యువ హీరోపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా,  'వర్మ' పేరుతో తమిళంలో రూపొందుతున్న అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో హీరోయిన్ గా మేఘా చౌధురి నటిస్తోంది. వాస్తవ జీవిత గాథలకు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన బాలా ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.


No comments:

Post a Comment

Post Bottom Ad