రేపల్లె నుంచి హీరో సుమన్ పోటీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

రేపల్లె నుంచి హీరో సుమన్ పోటీ!

వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజకీయ నాయకులతోపాటు సినిమా నటులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రేపల్లె నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం జనాభా ఎక్కువ. అదేవిధంగా మత్స్యకారులు ఎక్కువగానే ఉన్నారు. సుమన్ గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రేపల్లె నుంచి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నట్టు తెలుస్తోంది. సొంత సామాజికవర్గం ఓట్లతోపాటు సినీ గ్లామర్ తనకు అక్కరకొస్తుందనే యోచనలో ఈ హీరో ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్ పై నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ బరిలో ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోపిదేవి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మరోవైపు జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న దేవినేని మల్లికార్జునరావు పేరు వినిపిస్తోంది. జనసేన తరఫున దేవినేని పోటీ చేసినట్టయితే ఆయన గెలుపు తథ్యం. కాగా, ఈసారి అనగాని సత్యప్రసాద్ ను పక్కనపెట్టి టీడీపీ తరపున సుమన్ ను బరిలోకి దించే యోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad