నోకియా 9లో ఎనిమిది కెమెరాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

నోకియా 9లో ఎనిమిది కెమెరాలు!


త్వరలో మార్కెట్ లోకి అడుగుపెట్టనున్న నోకియా 9 ఫోన్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది కెమెరాలు ఉంటాయనే ఆలోచనే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో అంచనాలను పెంచేస్తోంది. వెనుక వైపు ఐదు కెమెరాలు, ముందువైపు మూడు కెమెరాలు మొత్తం ఎనిమిది కెమెరాలతో ఈ ఫోన్ రాబోతుందన్నమాట. వెనుకవైపు ఉండే పెంటా లెన్స్ కెమెరాల వల్లే ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల కావాల్సిన ఫోను లేటవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యి వైరల్‌గా మారాయి. 4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆండ్రాయిడ్‌ ఓఎస్ తో నడిచే ఈ ఫోన్లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయని వినికిడి. 

No comments:

Post a Comment

Post Bottom Ad