టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడితే కొంప కొల్లేరే అంటున్న ఐసీఐసీఐ డైరెక్టర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 13, 2018

టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడితే కొంప కొల్లేరే అంటున్న ఐసీఐసీఐ డైరెక్టర్

dont-depend-on-technology

టెక్నాలజీ సహాయంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కస్టమర్లకు అడిగినదే తడవుగా అప్పులు అందిస్తున్నాయి. క్రెడిట్ స్కోరు బాగుండి, మంచి పేమెంట్ హిస్టరీ కలిగిన కస్టమర్లకు ఇన్స్టాంట్ లోన్లను చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే కస్టమర్లకు అప్పులిచ్చే సమయంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు టెక్నాలజీపై అతి ఎక్కువగా ఆధారపడరాదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ పేర్కొంటున్నారు. అప్పులు ఇచ్చే సమయంలో సంస్థల ఉద్యోగులు వివేచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కేవలం క్రెడిట్ స్కోర్లు, కంప్యూటర్ ఆల్గోరిథమ్స్‌, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ మొదలైన వాటిపై మరీ ఎక్కువగా ఆధారపడకూడదని ఆయన సూచించారు. వీటిని తారుమారు చేసే అవకాశాలూ ఉన్నాయన్నారు. పోనీ పన్ను రిటర్నులను ప్రాతిపదికగా తీసుకున్నా.. దాఖలు చేసేవారిలో చాలా మంది తక్కువ ఆదాయ వర్గాలే ఉంటున్నందున స్పష్టమైన అంచనాకు రావడం కష్టమని బాగ్చీ తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad