అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్థానం ప్రారంభించి చిన్న హీరోగా మొదలుపెట్టి నేచురల్ స్టార్ గా మారిపోయాడు.. నాని. మంచి కామెడీ టైమింగ్, అద్భుత నటనతో మీడియం బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ప్రస్తుతం ఒకవైపు బిగ్ బాస్ హోస్ట్ గా, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు.. ఈ హీరో. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'దేవదాస్' సెప్టెంబర్ 27న విడుదల అవుతోంది. కాగా, గతంలో జెంటిల్మెన్, మజ్ను సినిమాలతో నాని హిట్లు కొట్టాడు. ఈ టైటిల్స్ తో గతంలోనే సినిమాలు వచ్చాయి. జెంటిల్మెన్ టైటిల్ తో ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, మజ్ను టైటిల్ తో దర్శకరత్న దాసరి నారాయణరావు సినిమాలు రూపొందించారు. జెంటిల్మెన్ లో అర్జున్, మజ్నులో నాగార్జున హీరోలుగా నటించారు. ఇప్పుడు విడుదలవుతున్న దేవదాస్ గతంలో ఎంత పెద్దహిట్టో చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన దేవదాసు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఆ చిత్రంలోని పాటలు అజరామరాలే. పాత టైటిల్స్ తో ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన నేచురల్ స్టార్ మూడోసారి మరోసారి పాత టైటిల్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ పూర్తిచేస్తాడేమో వేచిచూడాలి.

No comments:
Post a Comment