త్వరలో వాట్సప్‌ డార్క్ మోడ్ ఫీచర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

త్వరలో వాట్సప్‌ డార్క్ మోడ్ ఫీచర్


సోషల్ మీడియా టాప్ మెసేజింగ్‌ యాప్‌.. వాట్సప్‌ త్వరలో డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ సమయం వాట్సాప్ చూసేవారికి కళ్లు దెబ్బ తినకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తక్కువ వెలుతురులో లేదా చీకట్లో ఫోన్‌ వాడేటప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు వాట్సప్‌ ‘స్వైప్‌ టు రిప్లై’ ఫీచర్‌నూ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా మెసెజ్‌ను కుడివైపునకు స్వైప్‌ చేయడం ద్వారా సులువుగా రిప్లై పంపే వీలుంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్రస్తుతం సంబంధిత మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి రిప్లై ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి వస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad