పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్లు!


తనను రౌడీ అని అన్న పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు కౌంటర్లు ఇచ్చాడు. తను రౌడీనే అంటూ.. అయితే తను అసెంబ్లీ రౌడీని అని చింతమనేని చెప్పుకున్నాడు. తను హీరోని అన్నట్టుగా

chintamaneni prabhakar tdp mla fires pawan kalyan
చెప్పుకున్నాడు. తనపై ముప్పై కేసులు ఉన్నాయని పవన్ అంటున్నాడని.. ఉన్నది మూడు కేసులే అని చింతమనేని చెప్పుకున్నాడు. తన నియోజకవర్గంలో డెవలప్ మెంట్ గురించి మాట్లాడాలి చింతమనేని వ్యాఖ్యానించాడు. తన గురించి మాట్లాడి తనను పాపులర్ చేస్తున్నాడని పవన్ గురించి వ్యంగ్యంగా స్పందించాడు ఈ టీడీపీ ఎమ్మెల్యే.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన మీద దెందులూరులో పోటీ చేయాలని చింతమనేని సవాల్ విసిరాడు. ఒకవేళ తన మీద పవన్ పోటీ చేసి నెగ్గితే తను ఆయనతో కలిసి ఊరేగింపు నిర్వహిస్తానని.. పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తానని చింతమనేని వ్యాఖ్యానించాడు. అలాగక తను నెగ్గితే పవన్ కల్యాణ్ షేక్ హ్యాండిచ్చి వెళ్లిపోవచ్చని అన్నాడు.

కావాలంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు రావాలని.. దెందులూరు సీటును తనే పవన్ కల్యాణ్ కే త్యాగం చేస్తానని, ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తానని చింతమనేని ప్రకటించాడు. మొత్తానికి చింతమనేని పవన్ కు ఘాటు కౌంటర్లే ఇచ్చాడు. మరి దీనికి జనసేన ఏమంటుందో!

No comments:

Post a Comment

Post Bottom Ad