నిజమంటే నిజం.. సీఎం చంద్రబాబు పుష్కర స్నానం ఖర్చు రూ.2.41 కోట్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

నిజమంటే నిజం.. సీఎం చంద్రబాబు పుష్కర స్నానం ఖర్చు రూ.2.41 కోట్లు


2016లో కృష్ణా పుష్కరాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పుష్కర స్నానం ఏర్పాట్లకు అక్షరాలా రూ.2,41,91,500 అయిందని స్వయంగా గుంటూరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సదస్సులు తదితర కార్యక్రమాల కోసమంటూ ఇప్పటివరకు రూ.18,26,73,821 ఖర్చు చేశారు.  ఏ కార్యక్రమన్నైనా ఒక మెగా ఈవెంట్‌ తరహాలో నిర్వహించి, భారీగా ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అందుకే ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని అధికారులు అంటున్నారు. ఈ బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని ఈ కార్యక్రమాల ఏర్పాట్లు చేసిన ఏజెన్సీలు జిల్లా కలెక్టర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయని చెబుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో సంబంధిత శాఖలు కూడా నిధులను విడుదల చేయలేకపోతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాల ఖర్చులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను చెల్లించడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ బిల్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉందని లేఖలో స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad