నాగర్ కర్నూల్లో బస్సు ప్రమాదం, పది మందికి తీవ్రగాయాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 16, 2018

నాగర్ కర్నూల్లో బస్సు ప్రమాదం, పది మందికి తీవ్రగాయాలు!


కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 60 మందికిపైగా దుర్మరణం చెందిన సంఘటన తెలిసిందే. ప్రమాదానికి అన్ని దశల్లోని వ్యవస్థాగతమైన లోపాలే కారణమనడంలో సందేహంలేదు. ఫిట్నెస్ లేని బస్సులను ఆర్టీసీ తిప్పుతూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుందనే అనుమానాలు ఈ ప్రమాదం తర్వాత వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో సుమారు 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad