ఏమో.. గుప్తనిధులు దొరకావచ్చు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 08, 2018

ఏమో.. గుప్తనిధులు దొరకావచ్చు!

-ఆగని అన్వేషణలు
-ఆశ కొంత, అమాయకత్వం కొంత
-ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగడం మరో వింత
-తిరుమలలోనూ ఇవే ప్రయత్నాలు?
-ఏం జరుగుతోంది? దొరకబుచ్చుకున్న వాళ్లున్నారా?


గుప్తనిధుల కోసం అన్వేషణ... మిగతా ప్రపంచంలో ఏమో కానీ, స్ట్రేంజ్ కంట్రీ అయిన భారతదేశంలో చాలా రొటీన్‌గా జరిగే పని ఇది. ప్రత్యేకించి చారిత్రాత్మక నేపథ్యం, ఆలయాల నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అయితే ఇలాంటి అన్వేషణలు చేసే వాళ్లు తారసపడతారు. కొంతమందికి అయితే ఇదే పని. ఇదో పిచ్చి, ఇదో వ్యసనం. ఎక్కడో ఏదో దొరుకుతుంది అనేది వీళ్ల ఆశ. అంచనా. అందు కోసం తవ్వకాలు వీరి ప్రయత్నాలు. ఇక మంత్రశక్తి, తాంత్రిక విద్యల ప్రదర్శన కూడా ఈ అన్వేషణలకు అదనం. ఇలాంటి అన్వేషణల్లో ఎవరికైనా ఏమైనా దొరికిందా? అంటే సమాధానం చెప్పడం కష్టం కానీ, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి అన్వేషణ వార్తలు తరచూ వస్తుంటాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని తరచూ పత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఇదే పని మీద కొందరు అవిశ్రాంతంగా పని చేస్తూ ఉంటారు. అలాంటి నిధులు దొరుకుతాయని, ఉన్నఫలంగా తాము కోటీశ్వరులు అయిపోవాలనేది వాళ్ల ఆశ. ఈ ఆశ కొంతమందిలో వ్యసనంగా కూడా ఉంటుంది. వీళ్లు అనునిత్యం ఇలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. వీళ్లకు తోడు కొంతమంది మంత్రగాళ్లు తోడవుతూ ఉంటారు. ఈ మంత్రగాళ్లు తమ పొట్ట కూటి కోసం అలాంటి వ్యసనపరుల్లో ఆశలు రేకెత్తిస్తూ ఉంటారు. వాళ్ల చేత ఖర్చులు పెట్టించి, పూజలు అంటూ వీళ్లు బతికేస్తూ ఉంటారు.

కొంతమంది జూదం అనే వ్యసనం ఉంటుంది. అలాంటి వ్యసనాల్లో ఈ గుప్త నిధుల అన్వేషణ కూడా ఒకటి. ఎక్కడో ఒక చోట నిధి దొరకకపోదా?తాము కోటీశ్వరులం అయిపోలేమా? అనే ఆలోచనలతో ఈ మత్తులో మునిగితేలే వాళ్లు గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటారు. అలాగని నగర ప్రాంతాల్లో ఇలాంటి వారు లేరని కాదు. అక్కడ ఇలాంటి తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి. వీటిని నమ్మే వాళ్లు భారతదేశమంతా ఉంటారు.

కేవలం నమ్మకమేనా? 

కేవలం నమ్మకమే.. అది కూడా మూఢనమ్మకం అని తేల్చేయలేం. అలాగని సమర్థించనూ లేం. ఇదో స్ట్రేంజ్ ఇష్యూ. గ్రామాల్లో,చరిత్రాత్మక నేఫథ్యం ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి చోట తవ్వకాలు సాగుతున్నాయంటే.. దేవతల విగ్రహాల కింగ, కోటల్లో, ఏదైనా పాత శాసనం ఉంటే వాటి కింద.. ఇలాంటి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో వీటి పై ప్రచారమే తప్ప ఏదో దొరికినట్టుగా ఆధారాలు లభించవు. అక్కడ దొరికిందట, వాళ్లకు దొరికిందంట.. అంటూ జనాలు చెవులు కొరుక్కొంటూ ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన కోటలు, దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇలాంటి తవ్వకాలు చాలా రొటీన్ గా జరుగుతూ ఉంటాయి. ఆ పిచ్చి ఉన్న వాళ్లు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చట్టప్రకారం అయితే ఇలాంటి తవ్వకాలు జరపడం నేరం. అందుకే అర్దరాత్రుల్లో, మూడో కంటికి తెలియకుండా ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. నిజంగానే ఏమైనా దొరికితే తమకు దొరికిందని ఎవ్వరూ చెప్పుకోరు, ఇక దొరకకపోతే వాళ్లే చేతులు దులుపుకుని వెళ్లిపోతారు. ఆ ప్రయత్నం చేశామని కూడా చెప్పుకోరు. దీంతో ఈ గుప్తనిధుల అన్వేషణ అనేది ఆద్యంతం రహస్యంగానే ఉండిపోతోంది.

ప్రముఖులకూ ఇదే పని!

గుప్తనిధుల అన్వేషణ అంటే ఏదో ఎందుకూ కొరగానివారు చేసే పని కాదు. రాయలసీమలో ఇలాంటి ప్రయత్నాలతో కొంతమంది ప్రముఖులు కూడా బిజీగా ఉంటారనే వార్తలు వస్తూ ఉంటాయి. బాబాలుగా అవతారం ఎత్తిన వాళ్లకు ఇలాంటి నేపథ్యం ఉంది. కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలో ఒక బాబాపై ఇలాంటి ఆరోపణలు బలంగా వచ్చాయి. ఆయన ఆధ్వర్యంలో పెనుకొండ నుంచి, బుక్కపట్నం వరకూ బోలెడన్ని చారిత్రాత్మక ప్రాంతాల్లో ఆయన ఆధ్వర్యంలో ఇలాం
టి పనులు జరిగినట్టుగా అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. మీడియా వర్గాలు ఆయనపై ఇలాంటి కథనాలు ఇచ్చాయి. అప్పట్లో అనంతపురం జిల్లాకే చెందిన ఒక ఫ్యాక్షనిస్టు పొలిటీషియన్ కు కూడా ఆ అన్వేషణలను ప్రోత్సహించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వ్యవహారం కూడా ఒట్టి రూమర్ గానే మిగిలిపోయింది. పెనుకొండ ప్రాంతంలో అన్వేషణలు జరిగినది అయితే నిజం. అందుకు రుజువులు తవ్వకాలు. ఏమైనా దొరికిందా లేదా? అంటే మాత్రం ఆధారాలు లేవు.

ప్రభుత్వానికి ఆశలు పుట్టాయి!

ఈ గుప్తనిధుల అన్వేషణ ఇప్పుడు ఆథరైజ్డ్ క్రైమ్ అయ్యింది. ఈ క్రైమ్ చేస్తుంది మరెవరో కాదు, ప్రభుత్వమే. వెనుకటికి హైదరాబాద్‌లో ఇలాంటి ప్రయత్నాలు ప్రముఖ వార్తలుగా నిలిచాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఒక భారీ తవ్వక ప్రయత్నం జరిగింది. అయితే చివరకు నవ్వులపాలు కావడంతో ఆ ప్రయత్నాలను ఆపేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విమర్శల పాలవుతోంది. ముందుగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో ప్రభుత్వమే తవ్వకాలు చేయించడం విడ్డూరమైన అంశం.

ఎంతో చరిత్ర ఉన్న ఈ కోటలో గుప్తనిధుల తవ్వకం జరిగింది. ప్రభుత్వాధి కారుల ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్‌షిప్ లో ఈ తవ్వకాలు జరిగాయి. ఒక రోజు కాదు రెండు రోజులు.. 27 రోజుల పాటు అన్వేషణ సాగింది. ఈ అన్వేషణ ఎందుకు సాగింది అంటే గుప్తనిధుల కోసమే. అయితే ఈ తవ్వకాల్లో ఎలాంటి ఫలితం దక్కలేదు.  పాతాళగంగలో నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఈ తవ్వకాలు జరిగాయి. రాతిపై మూడు తలల నాగుపాము, ముందుకెళ్తే 11 మంది దేవతా మూర్తుల ప్రతిమలు, బొమ్మలు దాటుకుని ముందుకు వెళ్తే పాతాళగంగ, అక్కడ గుప్తునిధులు ఉన్నాయనే స్థానిక ప్రచారం మేరకు ప్రభుత్వమే ఈ పని చేయించింది. తొలి విడతలో 27రోజుల పాటు తవ్వకాలు చేశారు. క్యావిటీ స్కానర్లు, జీపీఎస్ స్కానర్లతో ఈ అన్వేషణ సాగించారు. భూమి లోపలకు ముప్పై అడుగుల లోతుకు తవ్వినా ఏమీ దొరకలేదు. దీంతో ఆపేశారు. ఆ పై రెండో వైపు ఉన్న పాతళగంగ బావి వద్ద తవ్వకాలు చేశారు.


ప్రభుత్వమే ఈ పని చేయడంతో విమర్శలు తీవ్రంగా వచ్చాయి. మరీ ఇంత మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయించడం ఏమిటి? అని అనేక మంది విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వచ్చాయి. అయినా వీటికి భయపడలేదు ప్రభు
త్వం. బావిలో 11 మెట్లు ఉంటాయని, తర్వాత సొరంగం ఉంటుందని, ఆ సొరంగంలోకి వెళితే నిధులు దొరుకుతాయనే నమ్మకంతో.. బావిలోని నీళ్లంటినీ బయటకు కొట్టేశారు. ఇలా కొన్ని రోజులు ప్రయత్నాలు చేసినా అధికారికంగా అయితే ఏమీ దొరకలేదు. ప్రజల సొమ్మను మాత్రం ఖర్చు పెట్టించారు. అయితే ఏదో దొరికే ఉంటుందని మాత్రం స్థానికులు అంటున్నారు. అలా దొరికిన వాటిని అధికారులు, నేతలు పంచుకుని ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తాయి స్థానికుల నుంచి. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక!

No comments:

Post a Comment

Post Bottom Ad