బిగ్ బాస్ విజేత ఎవరో తేలేది నేడే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

బిగ్ బాస్ విజేత ఎవరో తేలేది నేడే!


స్టార్ మా టీవీలో దాదాపు మూడున్నర నెలల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేడే ఆఖరి రోజు. నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గత సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీర్ హోస్ట్ చేసి ఈ షోకు తెలుగులో అగ్రస్థానాన నిలబెట్టారు. అలాగే గత సీజన్లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆ స్థాయికి తగ్గట్టుగానే  నాని ఈ సారి హోస్ట్గా వ్యవహరిస్తూ అంచనాలను అందుకున్నాడనడంలో సందేహంలేదు. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కు ఫినాలేకి సంబంధించిన 113వ ఎపిసోడ్‌ ప్రసారం అవుతుంది. వంద రోజుల‌కి పైగా సాగిన ఈ ప్రయాణంలో ఫైన‌ల్కు చేరిన దీప్తి నల్లమోతు, కౌశ‌ల్‌, త‌నీష్‌, గీతా మాధురి, సామ్రాట్‌ రెడ్డిల్లో సీజన్ -2 విజేత ఎవరో కొద్ది గంట‌ల్లో తేలనుంది.  

No comments:

Post a Comment

Post Bottom Ad