పురందేశ్వరి పాత్ర చేస్తోంది బెజవాడ అమ్మాయా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

పురందేశ్వరి పాత్ర చేస్తోంది బెజవాడ అమ్మాయా?


ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. యన్టీఆర్. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమాను వారాహి ప్రొడక్షన్స్ పతాకంపై సాయికొర్రపాటి, ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ, దగ్గుబాటి రాణా, సుమంత్, విద్యాబాలన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పాత్రలో నటించే నటి ఈమేనంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బెజవాడకు చెందిన డ్యాన్సర్ హిమన్సీ యన్టీఆర్ బయోపిక్ లో పురందేశ్వరి పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం పురందేశ్వరిని తలపించే ఆహార్యంలో ఉన్న హిమన్సీతో పురందేశ్వరి దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పురందేశ్వరి.. తన పాత్ర పోషిస్తున్న హిమన్సీని తదేకంగా చూస్తున్నారు. హిమన్సీ కూడా పురందేశ్వరి పాత్రకు సరిపోయేలా ఉన్నారు.


No comments:

Post a Comment

Post Bottom Ad